మొత్తం 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 19వ తేదీన రాత పరీక్షను మొత్తం 291 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరుకాగా, 57,923 మంది ఎంపికయ్యారు. వీరిలో పురుషులు 49,386 మంది ఉండగా, 8,537 మంది స్త్రీలు ఉన్నారు.
పరీక్ష నిర్వహించిన మరుసటి రోజే జవాబులకు సంబంధించిన ఆన్సర్ కీని విడుదల చేశారు. దీనిపై పేపర్-1కు దాదాపు 1,553 అభ్యంతరాలు బోర్డుకు అందాయి. వీటిని నిపుణులు పరిశీలించి, ఆన్సర్ కీలో ఎలాంటి మార్పులు చేయలేదని నిర్ధారించింది.