బండ్ల గణేష్‌కు జైలు శిక్ష వెనుక ఆ పార్టీ హస్తం...

సోమవారం, 27 నవంబరు 2017 (16:43 IST)
హాస్య నటుడు, టాలీవుడ్ నిర్మాత, పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని అయిన బండ్ల గణేష్‌కు ఎర్రమంజలి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్‌టిఆర్ హీరోగా తెరకెక్కించిన టెంపర్ సినిమాకు కథ రాసిన వక్కంతం వంశీకి రెమ్యునరేషన్‌గా ఇచ్చిన చెక్ బౌన్స్ అవడంతో ఆయన కోర్టుకు వెళ్లారు. ఈ కేసులో ఇద్దరి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. బండ్ల గణేష్‌కు జైలు శిక్షతో పాటు 17లక్షల 86వేల రూపాయల జరిమానాను విధించింది.
 
బండ్ల గణేష్‌కు శిక్ష పడటానికి ప్రధాన కారణం ఓ రాజకీయ పార్టీయేనని ప్రచారం జరుగుతోంది. ఇటీవల నంది అవార్డుల విషయంపై గణేష్‌ తీవ్ర పదజాలంతో ఆ పార్టీని దూషించారు. ఇచ్చినవి నంది అవార్డులు కావని ఎద్దేవా  చేశారు. శాసనసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి బాలక్రిష్ణ ఉత్తమ హీరో అవార్డు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సినీ పరిశ్రమకు సగం లాభం తీసుకువచ్చే మెగా కుటుంబాన్ని అవమానించారని మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు చేయడంతోనే ఆయనకు చెక్ బౌన్స్ కేసు మెడకు చుట్టుకున్నదన్న వార్తలు వస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు