కాణిపాకంలో స‌త్యదేవుడిపై ప్ర‌మాణం చేసిన‌ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

మంగళవారం, 10 ఆగస్టు 2021 (13:47 IST)
తాను ఏ ఆశ్రమం, మఠం నుంచి డబ్బులు తీసుకోలేద‌ని, ఏ రకమైన రాజకీయ అవినీతికి పాల్పడలేద‌ని కాణిపాకంలో స‌త్యదేవుడిపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రమాణం చేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవ‌స్థానంలో వేద పండితులు, అధికారులు, పార్టీ శ్రేణుల మధ్య సత్యదేవుడు ఎదుట ప్రమాణం చేశారు.

తాను 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నానని, ఈ రోజు దేవుడు ఆలయంలో , అధికారులు, వేద పండితుల, మా పార్టీ శ్రేణుల సమక్షంలో ప్రమాణం చేస్తున్నాన‌ని విష్ణువర్ధన్ రెడ్డి ఉద్విగ్నంగా చెప్పారు. త‌న‌లాగే, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లును కూడా ప్రమాణం చేయాల‌ని ఆహ్వానం పలుకుతున్నా అని విష్ణువర్ధన్ రెడ్డి స‌వాలు చేశారు.

నేను నా నిజాయితీని రుజువు చేసుకోవడానికి కాణిపాకంలో ప్రమాణం చేశాను. ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు ఇక్క‌డి రాలేక‌, కాణిపాకం ప్రమాణానికి రాకుండా పారిపోయాడ‌ని విమ‌ర్శించారు. రాచమల్లు మహిళలను అవమానపరిచి మాట్లాడార‌ని, అయినా రాచమల్లు ఇంట్లోని ఆడబిడ్డలను నా కుటుంబ సభ్యులుగా బావించి పసుపు కుంకుమ చీర పంపుతాన‌ని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. తాను దిగుజారుడు వ్యాఖ్యలు చేయదలుచుకోలేద‌ని, రాజకీయంగా ఎప్పుడూ పసుపు కుంకమను వాడుకోన్నారు.

బాధ్యత గల వ్యక్తిగా 10 రోజుల్లో ప్రమాణం చేస్తానని చెప్పా. అందుకే కాణిపాకం వచ్చా. ఎమ్మెల్యే రాచమల్లు కు హిందూ ఆలయాల పట్ల నమ్మకం లేకపోవచ్చు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి, వైసీపీ నేతలకు ఇకనైనా మంచి బుద్దిని ప్రసాదించాలని కాణిపాకం స్వామి వారిని కోరుకుంటున్నాన‌ని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు