ఆర్టీజీఎస్ సీఈఓ బాబు ఏ అధికారులకు స్వాగతం పలికారు. ప్రజలకు రియల్ టైమ్‌లో ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి, నవరత్నాల పథకాలను అమలు చేయడంలో టెక్నాలజీ ఎలా ఉపయోగించుకుంటున్నదీ వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటోందని వివరించారు.
గ్రామ వాలంటీర్లు, స్పందన, అమ్మఒడి, రైతు భరోసాలాంటి పథకాలను సమర్థంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటోందని వివరించారు. కాగ్ అధికారులు మాట్లాడుతూ ఆర్టీజీఎస్ పనితీరు అద్భుతంగా ఉందన్నారు. నవరత్నాలను సమర్థంగా అమలు చేయడంలో ఆర్టీజీఎస్ చాలా బాగ పనిచేస్తోంది. గ్రామ వాలంటీర్లు, అమ్మ ఒడి, స్పందన లాంటి కార్యక్రమాల అమలు ఆదర్శనీయంగా ఉందన్నారు.
వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడానికి ఆర్టీజీఎస్ టెక్నాలజీ వినియోగిస్తున్న తీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. రియల్ టైమ్‌లో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలను కాగ్ అధికారులు ప్రశంసించారు. ప్రభుత్వ వ్యవస్థలో ఇంత మంచి సదుపాయం ఉండటం అద్భుతంగా ఉందన్నారు.