తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా లక్ష్మీ నారాయణ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడలో నిర్వహించిన ''ప్రజాస్వామ్మ పరిరక్షణ సదస్సు''లో మాట్లాడుతూ.. సామాజిక వర్గం కంటే, సమాజమే ముఖ్యమని.. ప్రజాస్వామ్యం వైపు పూర్తిగా ప్రజలు తమ ఆలోచనలు మళ్లించాలని.. రాజకీయ వ్యవస్థలో మంచి మార్పు తీసుకురావాలని సూచించారు.
ఈ ప్రాంతంలో కొబ్బరి రైతుల సమస్యలు, మత్స్యకారుల సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను గుర్తించామని, ఓఎన్జీసీ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఓ నివేదిక తయారు చేస్తున్నట్లు చెప్పారు.