ఆదివారం రాత్రి హైదరాబాదులో జరిగిన ఒక అవార్డు ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదాపై అన్ని వర్గాల వారు తమ వాదన వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఖచ్చితంగా సానుకూల పరిష్కారం చూపుతుందని నమ్ముతున్నట్టు చెప్పారు. అదేసమయంలో మీడియా కూడా ఎంతో బాధ్యతతో కథనాలను ప్రసారం చేయాలన్నారు. ముఖ్యంగా, ప్రజలను రెచ్చగొట్టేలా కథాలను ప్రసారం చేయరాదని హితవు పలికారు.
ఇకపోతే, సమాజంలో ఆధ్యాత్మికత తగ్గడమే పసిపిల్లలు, మహిళలపై అత్యాచార ఘటనలు పెరగడానికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆధ్యాత్మికత వైపు మళ్లించడం ద్వారా మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన అన్నారు. దీనికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నడుంబిగించాలని ఆయన సూచించారు.