టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రం స్పష్టతను ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద ఈ ప్లాంటును నిర్మించబోతున్నామని... 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ప్లాంటులో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.
కాగా, గతంలో కూడా ఇక్కడ అణు విద్యుత్ కర్మాగారం నిర్మించేందుకు ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టగా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇపుడు ఇదే ప్రాంతంలో ప్రధాని మోడీ సర్కారు ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించింది.