ద్విచక్రవాహనం నుంచి కిందపడిన మహిళలు ... కాన్వాయ్ ఆపి చికిత్స చేయించిన చంద్రబాబు

శుక్రవారం, 14 జులై 2023 (16:18 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు మహిళలకు చికిత్స చేయించారు. ద్విచక్రవాహనంపై వెళుతూ జారి కిందపడిపోయిన ఇద్దరు మహిళలను గుర్తించిన ఆయన.. ఆయన తన కాన్వాయ్‌ను ఆపి వారికి చికిత్స చేయించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ సీతానగరంలో ద్విచక్రవాహనంలో వెళుతున్న ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఆ సమయంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి బయలుదేరారు. అయితే, మహిళలు కిందపడిపోయిన విషయాన్ని గుర్తించిన చంద్రబాబు తన కాన్వాయ్‌ను ఆపించారు. కారు దిగి గాపడిన ఇద్దరు మహిళల వద్దకు వచ్చారు. 
 
తన కాన్వాయ్‌లోని వైద్యుడితో వారికి చికిత్స చేయించారు. బాధిత మహిళలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత తన కాన్వాయ్‌లోని ఓ కారులో వారిని ఇంటివద్ద దించి, వారికి కావాల్సిన మందులను ఇవ్వాలని తన సిబ్బందిని ఆదేశించారు. అలాగే, తన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో బాధితుల బంధువులకు ఫోన్ చేయించారు. బాధితులను వాహనలో పంపించి, ఆయన అక్కడ నుంచి పార్టీ ఆఫీసుకు బయలుదేరి వెళ్లారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు