తమకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో గాంధీ జయంతి రోజున 'సత్యమేవ జయతే' పేరిట చేపట్టనున్న ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకుల పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, రాజానగరం నియోజకవర్గాల నుంచి సుమారు 8,000 మంది మహిళలు హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆ మేరకు స్థానిక క్వారీ సెంటర్ సమీపంలోని సుమారు నాలుగు ఎకరాల స్థలంలో రెండున్నర ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 నుంచి సాయత్రం 5 వరకు ఈ నిరశన దీక్షసాగుతుంది. రాజమహేంద్రవరం విద్యానగర్‌లో బస చేసిన కేంద్రం నుంచి భువనేశ్వరి ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సమీపంలో జాతిపిత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు