ఎపి డిజిపికి చంద్రబాబు లేఖ, ఎందుకు రాశారంటే..?

మంగళవారం, 11 ఆగస్టు 2020 (18:27 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు డిజిపికి లేఖ రాశారు. టిడిపి కార్యకర్తలు, నాయకులపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. ఇష్టానుసారం అక్రమ కేసులు పెడుతుంటే కార్యకర్తలు మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు.
 
చిత్తూరుజిల్లా చంద్రగిరికి చెందిన రాకేష్ చౌదరి అనే టిడిపి కార్యకర్తపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించి అరెస్టు చేయించారు. వైసిపికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ 2007 సంవత్సరంలో జరిగిన స్థల వివాదాన్ని చూపించి అందులో ముద్దాయిగా ఇరికించి అరెస్టు చేశారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
 
వెంటనే రాకేష్ చౌదరిని విడుదల చేయాలని.. అక్రమ కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. డిజిపితో పాటు ఆ లేఖను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డికి అటాచ్ చేశారు చంద్రబాబు. డిజిపి స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు