ఈవో త్రినాథరావు ఆరా తీయగా విషయం తెలిసిన వెంటనే ఆటోను కొండ కిందకు పంపించినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. అన్యమత ప్రచార పోస్టరు అంటించి ఉన్న ఆటో కొండపైకి వస్తుంటే టోల్‌గేటు సిబ్బంది ఏం చేస్తున్నారని ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని భద్రతా విభాగ ఇన్‌ఛార్జి వర్మ, ట్రాన్స్‌పోర్ట్ సిబ్బంది సత్యనారాయణ, ప్రసాదనాయుడులకు మెమో ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఆదేశాలు జారీ:
కొండపైకి వాహనాలు వచ్చే సమయంలో పూర్తిస్థాయిలో తనిఖీ చేసి పంపాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే తగిన చర్యలు తీసుకుంటామని ఈఓ ఆదేశాలు ఇచ్చారు. వాహనాలను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి అన్యమత ప్రచార స్టిక్కర్లు, సామగ్రి కొండపైకి రాకుండా నివారించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ విషయమై టోల్‌గేటు వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని పీఆర్వో విభాగానికి ఆదేశాలిచ్చారు.