మీకెందుకురా పిచ్చిము... కొడకల్లారా కొట్లాట.. దళితులపై చింతమనేని

బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (18:23 IST)
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దళితులను ఉద్దేశించి చింతమనేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. 
 
దళితులను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ చింతమనేని ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే.. దళితులకు రాజకీయాలు అక్కర్లేదన్న చందంగా మాట్లాడారు. 
 
''రాజకీయంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే. మీరు దళితులు, మీరు వెనకబడినవారు, మీరు షెడ్యూల్ క్యాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయ్, మాకు పదవులు.. మీకెందుకురా పిచ్చిముండా కొడకల్లారా కొట్లాట'' అంటూ తీవ్ర పదజాలంతో చింతమనేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం విమర్శలకు దారితీశాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు