కానీ, ఈలోగా ప్రాథమిక కసరత్తు, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశాలిచ్చారు. ఏపీలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో వైసీపీ ప్రకటించింది.
అరకు పార్లమెంటును రెండు జిల్లాలగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిన్న సాయంత్రం జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే, జిల్లాల విభజన వైసీపీ ప్రభుత్వం ఎత్తుగడ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఈ ఎత్తుగడ వేస్తున్నారని పేర్కొంటున్నాయి. కేంద్రం జనగణన చేయకుండా, ఇక్కడ జిల్లాల విభజన సాధ్యం కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.