ప్రజావేదిక పరికరాల వేలం... సీఆర్డీఏ నిర్ణయం

సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (15:43 IST)
తొమ్మిది నెలల క్రితం కూల్చేసిన ప్రజావేదిక పరికరాలను వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇంటి పక్కనే ఉన్న ప్రజావేదికను తొమ్మిది నెలల క్రితం అధికారులు కూల్చివేశారు. ప్రజా వేదికను అనుమతుల్లేవంటూ దాన్ని వెంటనే తొలగించాలని సీఎం జగన్ ఆదేశించిన మరుసటి రోజే సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. 
 
అప్పటి నుంచి తొమ్మిది నెలల పాటు ఏసీలు, పరికరాలను అలానే ఉంచేశారు. చివరకు ఆ పరికరాలను వేలం వేయాలని సీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. మార్చి 3వ తేదీలోగా వేలం పత్రాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ వేలం ప్రారంభం కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు