ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 16 సాయంత్రం వరకు కొత్తగా 1206 డెంగీ కేసులు నమోదయ్యాయి. వాటిలో హైదరాబాద్‌లో 447, రంగారెడ్డిలో 115, ఖమ్మంలో 122 డెంగీ పాజిటివ్‌లు వచ్చాయి.
అంటే 60 కేసులు ఈ మూడు జిల్లాల్లోనే నమోదయ్యాయి. ఈ ఏడాది జూలై 23 నాటికి రాష్ట్రంలో 405 డెంగీ, 409 మలేరియా కేసులున్నాయి. కేవలం 24 రోజుల్లోనే కొత్తగా 801 డెంగీ, 100 మలేరియా కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో 12 జిల్లాల్లను డెంగీ, 11 జిల్లాలను మలేరియా హైరిస్కు జిల్లాలుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
నాలుగు జిల్లాల్లో మాత్రం రెండింటి తీవ్రత ఉన్నట్లు గుర్తించింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ కేసులు పెరుగుతున్నాయి. నగరాలు, మునిసిపాలిటీలతో పాటు ఏజెన్సీ ఏరియాల్లో సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వాటి విజృంభణ మొదలైంది.