"ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికల్లో గెలిచి రాజధాని మార్చండని చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ ని స్వీకరించడానికి వైకాపా నాయకులు, జగన్ ఎందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ నాయకులు భయపడుతున్నారు. జగన్ అభివృద్ది విధానాన్ని కాక విధ్వంసక విధానాన్ని అమలుపరుస్తున్నారు.
మొత్తం సమగ్రాభివృద్ధిని నాశనం చేసి అమరావతి ని అభివృద్ది చేస్తాం అనే వైసీపీ వాదన అర్దం లేనిది. రాజధాని అంశం ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో చెందిన అంశం కాదు. ఇది మొత్తం రాష్ట్రానికి, ప్రజలకు సంబంధించింది. మూడు రాజధానుల అంశం చిన్నదిగా చేసి చూస్తే మొత్తం రాష్ట్రానికి పెద్ద నష్టం జరుగుతోంది. జగన్ ఒక ఏడాది పాలనలో రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చారు.
తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్, దౌలతాబాడ్ నుండి ఢిల్లీకి మార్చినప్పుడు ఖజానా మొత్తం ఖాళీ అయ్యి పెద్ద ఆర్థిక విపత్తును ఎదుర్కొని చివరకు సామ్రాజ్యమే పతనమైపోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి రాష్ట్రాన్ని కాపాడుకోక పోతే రాష్ట్రానికి తుగ్లక్ సామ్రాజ్యానికి పట్టిన గతే పడుతుంది. రాష్ట్రం అంధకారమవుతుంది" అని విమర్శించారు.