ప్రణాళికతో చర్యలు తీసుకోవడంతో అకడమిక్ క్యాలెండర్ గాడిలో పెట్టామని చెప్పారు. పెద్ద ఎత్తున కరోనా సంక్షోభం వస్తే కొంత నష్టం తప్పక ఉంటుందని, దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు మన రాష్ట్రంలోనే చేశామని పేర్కొన్నారు. కరోనా మళ్లీ పుంజుకుంటోందని, రెండు నెలలు జాగ్రత్త అవసరమని తెలిపారు.
పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు ఇంకా పెంచుతామని, ఆదివారాలు కూడా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.