స్టైరీన్ గ్యాస్‌ను పీల్చడం వల్ల తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్లు మంటలు వంటివి ప్రథమంగా కనిపిస్తాయి. అధిక మోతాదులో పీలిస్తే క్యాన్సర్, కిడ్నీ సమస్యలతోపాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది.
ఇటువంటి ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే ప్రమాదస్థలి నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే ఆ వ్యక్తికి వైద్య చికిత్సను అందించాలి. 'లాక్డౌన్ కారణంగా 45 రోజుల నుంచి పరిశ్రమలో ఎలాంటి పనులూ జరగకపోవడంతో స్టైరీన్‌ను నిల్వ ఉంచే చోట ఒత్తిడి పెరిగి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అయితే ఈ గ్యాస్ ప్రభావం ఒకటి, రెండు రోజుల వరకూ ఉంటుంది. స్టైరీన్ గ్యాస్‌ను పీల్చడం వల్ల ముక్కు, గొంతు దురదపెట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం జరుగుతుంది. అలాగే జీర్ణాశయంపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఒకవేళ గ్యాస్‌ను కనుక అధిక మోతాదులో పీలిస్తే ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బంది ఎదురవుతుంది.