దీనిపై నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డను తొలగిస్తున్నామని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు ఛాలెంజ్ చేయగా, అక్కడా ఎదురుదెబ్బే తగిలింది.
కొన్ని రోజుల క్రితం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయట్లేదని పిటిషన్ దాఖలు చేసిన ఆయన.. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల కార్యదర్శిని చేర్చారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.