మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. వావి వరసులు లేకుండా, చిన్నాపెద్దా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో కన్న తండ్రి. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… నందనవనం కాలనీ రోషన్‌దౌలాలో ఓ వ్యక్తి తన కుమారుడు, కుమార్తెను ఆటో నడుపుకుంటూ పోషిస్తున్నాడు. అనారోగ్యం కారణంగా అతడి భార్య మూడేళ్ల కిందట చనిపోయింది. దీంతో మద్యానికి బానిసైన అతడు తాగిన మైకంలో తన కుమార్తెపై కన్నేశాడు.