"కిల్లర్" పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో లీడ్ ఆర్టిస్టులంతా పాల్గొంటున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ తాజా షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో "కిల్లర్" పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ సినిమాను రూపొందుతోంది. సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ గా "కిల్లర్" పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ సినిమా ప్రేక్షకులకు మెమొరబుల్ ఎక్సిపీరియన్స్ ఇవ్వనుంది.