సీడీయూ 3వ యూనిట్‌లో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
ఈ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు సైరన్ మోగించిన ఉద్యోగులను అందరినీ బయటకు పంపారు. ప్రమాద స్థలంలో ఆరుగురు ఉద్యోగులు, మరికొందరు కార్మికులు ఉన్నట్లు సమాచారం. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.