మైనార్టీలకు రెండేళ్ళ‌లో రూ. 3,430 కోట్ల లబ్ది

శనివారం, 7 ఆగస్టు 2021 (17:14 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటినుంచి సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల ముంగిటకే అందిస్తున్నారని, ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకే అందించిన ఘనత ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష పేర్కొన్నారు. శనివారం అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్  అతిథి గృహంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్  మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలుచేస్తూ 95 శాతం హామీలను అమలు చేశారని, దేశంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రమే ఇచ్చిన హామీలను అమలు చేసిందన్నారు.

 అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ క్యాబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం పదవులను కేటాయించడం జరిగిందని, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించడం జరిగిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక్కొక్కరిని ఉప ముఖ్యమంత్రులను చేశారని, ఇది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. తమ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందన్నారు.
 
రాష్ట్రంలో 139 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, 56 కార్పొరేషన్లకు 56 మంది చైర్మన్లను నియమించడం జరిగిందని, సుమారు 700 మంది డైరెక్టర్లను నియమించడం జరిగిందన్నారు. ఆయా కార్పొరేషన్లకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం పదవులను కేటాయించడం జరిగిందని,  తమ ప్రభుత్వంమ  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉన్నతమైన పదవులు కేటాయించడం జరిగిందని, ఇతర కులాలకు ఇదొక విప్లవం అయితే, మైనార్టీలకు ఇదొక స్వర్ణయుగం అన్నారు.
 
మొన్న 80 మందికి రాష్ట్ర స్థాయి చైర్మన్ ల పదవులను నియమిస్తే అందులో 12 మంది మైనారిటీలకు పదవులు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 12 మేయర్ స్థానాలు ఉంటే అందులో ఇద్దరు మైనారిటీ వర్గానికి చెందిన వారు ఉన్నారని, పదుల సంఖ్యలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ లు ఉన్నారన్నారు. మైనారిటీ వర్గానికి ఉన్నతమైన పదవులు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట మైనారిటీలు అండగా ఉంటారన్నారు. మైనారిటీల సంక్షేమానికి అభివృద్ధికి ఈ రెండు సంవత్సరాల కాలంలో వివిధ పథకాల ద్వారా రూపాయలు 3430 కోట్ల లబ్ధి  చేకూరింద‌ని చెప్పారు.
 
ఈ సమావేశంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, రాష్ట్ర హజ్ కమిటి చైర్మన్ గోసూల్ ఆజం, నగరపాలక సంస్థ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, రెండవ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, మార్కెట్ చైర్మన్ ఫయాజ్ భాష, తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు