ఆప్ఘనిస్థాన్‌లో 385 మంది తాలిబన్ ఉగ్రమూకలు మృతి చెందారు. ఆప్ఘనిస్థాన్ వ్యాప్తంగా భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో 385 మంది తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారని, 210 మంది గాయపడ్డారని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
24 గంటల్లో నంగర్‌హార్, లోగర్, గజనీ, పక్తికా, మైదాన్ వార్తక్‌లో అఫ్ఘన్ జాతీయ రక్షణ భద్రతా దళాలు (ఏఎన్‌డీఎస్‌ఎఫ్) నిర్వహించిన భద్రతా కార్యకలాపాలను రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫవాద్ అమన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కాందహార్, హెరాత్, ఫరా, జౌజ్జాన్, సమంగాన్, హెల్మాండ్, తఖర్, బాగ్లాన్, కపిసా, ఫైజ్-అబాద్ నగరం, బడాఖాన్ ప్రావిన్షియల్ సెంటర్, తఖర్ ప్రావిన్షియల్ రాజధాని తాలిఖాన్ సిటీపై తాలిబాన్ల దాడులను భద్రతా బలగాలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు.
నాంగర్‌హార్, లోగర్, గజనీ, పక్తికా, మైదాన్ వార్దక్, కాందహార్, హెరాత్, ఫరా, జౌజ్జాన్, సమంగాన్, హెల్మాండ్, తఖర్, బాగ్లాన్ కపిసా ప్రావిన్సుల్లో 385 తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారని, 210 మంది గాయపడ్డారని ట్వీట్ చేశారు.