జగన్‌కు ఈసారి విదేశీ జైలే: లోకేష్

శనివారం, 6 మార్చి 2021 (11:06 IST)
జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కేవలం కేసుల మాఫీకోసమేనని తేలిపోయిందన్నారు.

జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే జగన్ అండ్ డెకాయిట్ బ్యాచ్‌కు మరోసారి చిప్పకూడు ఖాయం అని స్పష్టమవుతోందన్నారు. ఈసారి ఏకంగా విదేశీయులు జగన్ రెడ్డి గ్యాంగ్‌ ఆర్థిక నేరాలపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. ఈసారి చంచల్ గూడా కాదు విదేశీ జైలే అని లోకేష్ అన్నారు.
 
అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అని విదేశీ సంస్థలు అంటున్నాయి. జగన్‌కు దగ్గరగా ఉండే వ్యక్తులు, ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్నవాళ్లు విదేశాల్లో లెక్కపెట్టలేనన్ని డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

సీఎం అనుచరులు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని విదేశాల నుంచి పిర్యాదులు, ఆరోపణలు రావడంతో కేంద్రం ఈ వ్యవహారం సంగతి తేల్చేందుకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను రంగంలోకి దించినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు