కుప్పంలో ఓడిన బాబును, మంగ‌ళ‌గిరిలో ఓడిన లోకేష్‌ను ప్ర‌జ‌లు ఛీకొడుతున్నారు: మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్‌

బుధవారం, 3 మార్చి 2021 (20:45 IST)
విజ‌య‌వాడ న‌గ‌ర అభివృద్ధి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంతోనే సాధ్య‌మ‌ని మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. బుధ‌వారం విజ‌య‌వాడ ప‌శ్చిమ‌ నియోజక వర్గం 38వ డివిజనులో రథం సెంటర్ నుంచి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు  38వ డివిజన్ అభ్యర్ధి ఎమ్ డి రేహమతున్నిసాతో కలసి ప్ర‌చారం నిర్వ‌హించారు.
 
ప్ర‌తి ఇంటికి కూడా ఒక‌టి, రెండు, మూడు ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు అందాయ‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారని అన్నారు. మ‌ళ్లీ జ‌గ‌న‌న్న రావాల‌ని ప్ర‌జ‌లంతా కోరుకుంటున్నార‌ని చెప్పారు. ఏ వార్డుకు వెళ్లినా కూడా ఓట‌ర్ల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుంద‌ని, వైయ‌స్ జ‌గ‌న్ ఎవ‌రిని నిల‌బెట్టినా కార్పొరేట‌ర్లుగా అత్య‌ధిక మెజారిటీతో గెలిపిస్తామ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నార‌న్నారు.
 
విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగుర‌వేస్తామ‌ని మంత్రి ధీమా వ్య‌క్తం చేశారు. గ‌త ఐదు సంవ‌త్స‌రాలు చంద్ర‌బాబు న‌గ‌రాభివృద్దిని పట్టించుకోకుండా అరాచ‌క పాల‌న సాగించ‌రాన్నారు. కుప్పంలో ఓడిన బాబును, మంగ‌ళ‌గిరిలో ఓడిన నారా లోకేష్‌ను ప్ర‌జ‌లు ఛీకొడుతున్నార‌న్నారు.
 
ప‌శ్చిమ‌లో గన్నవరం ఎమ్మెల్యే వంశీ ప్ర‌చారం
విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థుల గెలుపున‌కు కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్ర‌చారం చేశారు. 38వ డివిజన్ అభ్యర్ధి ఎమ్ డి రేహమతున్నిసా, 40 డివిజ‌న్ అభ్య‌ర్థి యరడ్ల అంజ‌నేయ రెడ్డి ప్ర‌చారంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు