ఉద్ధానంలో ఇంటింటికి కుళాయిల ద్వారా వైయస్సార్ సుజల ధార మంచినీటిని సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చుతామని రాష్ట్ర పశుసంవర్ధక ,పాడి పారిశ్రామికాభివృద్ధి , మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.
ఉద్ధానంలో శుద్ధజలాలు అందించడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ప్రాజెక్టులో భాగంగా 9 క్లస్టర్లు , 553 ట్యాంకులను నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు శుద్ధ జలాలు అందించి ఆరోగ్య ఉద్ధానాన్ని తయారు చేస్తామని పేర్కొన్నారు.