బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

దేవీ

శనివారం, 19 ఏప్రియల్ 2025 (17:28 IST)
Prudhivi, kalyanram, vijayasanthi etc
మంచి సినిమా అందిస్తే ఆదరించడానికి ఎప్పుడూ ముందుంటారని 'అర్జున్ S/O వైజయంతి' విజయంతో మరోసారి రుజువు చేసిన తెలుగు ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శనివారంనాడు ఆయన విజయసభలో పలు విషయాలు తెలియజేశారు. విజయశాంతిగారు పాత్ర చేయబట్టే నేను ఈ సినిమాా తీశానని అన్నారు. కళ్యాణ్ బాబు రిస్క్ తీసుకోవడం వలనే సినిమా ఇంత గొప్పగా వచ్చింది. హ్యాట్సప్ కళ్యాణ్ బాబు అని విజయశాంతి తెలిపారు.
 
విజయశాంతి మాట్లాడుతూ,  ప్రజలు లేకపోతే ప్రేక్షకులు లేకపోతే ఏ హీరో లేరు, ఏ హీరోయిన్ లేదు. ఈరోజు సినిమా హిట్ అయిందంటే ఆ క్రెడిట్ మొత్తం ప్రేక్షకులదే. హీరోలు హీరోయిన్లకు జోష్ ఇచ్చి నిలబెట్టేది ప్రేక్షకులు. వారిని జీవితాంతం వారిని గుండెల్లో పెట్టుకుంటాం. చాలా సంవత్సరాల తర్వాత శ్రీకాంత్ గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. డైరెక్టర్ ప్రదీప్ ప్రతి క్యారెక్టర్ని చాలా బ్యాలెన్స్ గా డీల్ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంది. ఆ సీన్ ని వేరే హీరో అయితే ఒప్పుకోరు. ఇంపాజిబుల్. హీరోలకి ఇమేజ్ విషయంలో చాలా లెక్కలు ఉంటాయి. ఈ సినిమాలో కళ్యాణ్ బాబు అంతా రిస్క్ తీసుకుని లాస్ట్ 20 నిమిషాల్ని అద్భుతంగా మలచడంలో ప్రధాన పాత్ర పోషించారు. అంత రిస్క్ చేసిన బాబుకి నిజంగా హాట్సాఫ్ చెప్పాలి. బాబుకి హృదయపూర్వక అభినందనలు. దేవుడు దయవల్ల ఈ సినిమా ప్రజలకు నచ్చింది. మా కష్టానికి తగిన ఫలితం దొరకడం ఆనందాన్ని ఇచ్చింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని భారీగా తరకెక్కించారు. వారి గట్స్ కి హ్యాట్సాఫ్ .మహిళలు ఈ సినిమాకి వస్తున్నారు. అనేక చోట్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు. సినిమా బాగుందని చెప్తున్నారు. తల్లి కొడుకుల ఎమోషన్తో కూడుకున్న కథ ఇది. మహిళలందరూ కూడా ఈ సినిమాకి వస్తున్నారని అన్నారు.
 
హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, మంచి సినిమాని అందిస్తే మమ్మల్ని ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. బింబిసార సినిమా సమయంలో కూడా ఇదే మాట చెప్పాను. మరోసారి ఆ మాటని రుజువు చేసిన ప్రేక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేసి మంగళవారం బుధవారం లోగ బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్'అని వాళ్ళు చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ కథ ఫస్ట్ డే చెప్పినప్పుడే ఇది ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పాడు ప్రదీప్. తనకి కమర్షియల్ సినిమా మేకింగ్ లో మంచి టేస్ట్ ఉంది. కమర్షియల్ సినిమాలో కూడా కొత్తదనం ఉంటేనే ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు ఆడియన్స్ అంతలా కనెక్ట్ అవుతున్నారంటే అది డైరెక్టర్ ఈ కథని అంత ఎమోషనల్ గా నడిపిన విధానం. ఇంత మంచి కథని అందించిన ప్రదీప్ కి థాంక్యూ. పృథ్వి గారిని స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. సినిమా అనేది థియేటర్ ఎక్స్పీరియన్స్. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ కి గురవ్వాలి. ఇలాంటి క్లైమాస్క్ చెప్పిన శ్రీకాంత్ విస్సా  కి థాంక్యూ. రఘురాం ఇందులో ఎమోషనల్ సాంగ్స్ ని అద్భుతంగా రాశాడు. 
 
మా బ్యానర్ ప్రతి సినిమాలో  రామకృష్ణ మాస్టారు ఉంటారు. మా అబ్బాయి సినిమా చూసి 'నాన్న మీ సినిమాలో బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఇవే' అని చెప్పాడు. ఫైట్ మాస్టర్స్ అందరికీ థాంక్యూ.  అతనొక్కడే సినిమాకి రాంప్రసాద్ గారు డిఓపి. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఆయనతో ఈ సినిమా కలిసి చేశాం. అప్పుడు ఏ ఎనర్జీ ఉండేదో ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో ఉన్నారు. ఈ సినిమా క్లైమాక్స్ ఎక్స్ట్రార్డినరీ అని చెప్పిన ఫస్ట్ పర్సన్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. సినిమా చాలా అద్భుతంగా రావాలి మంచి విజయం సాధించాలని నిరంతరం తపనతో పనిచేసిన మా ప్రొడ్యూసర్స్ అశోక్ సునీల్ కి థాంక్యూ. నెక్స్ట్ సినిమా కూడా  వారి బ్యానర్ లోనే చేయాలని ఉంది. అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ చేసిన అజినిస్ కు  థాంక్యూ. అమ్మ (విజయశాంతి) గారు ఈ సినిమా చేయకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమా మెయిన్ పిల్లర్ అమ్మ. ఈ కథ చెప్పినప్పుడు నాకు ఒక రియల్ లైఫ్ సంఘటన గుర్తొచ్చింది. 
 
నాకు 13 ఏళ్ళు వచ్చే వరకు మా అమ్మ పుట్టిన రోజు ఎప్పుడో నాకు తెలియదు. అమ్మ బర్త్ డే  తెలుసుకునే క్రమంలో సంక్రాంతి రోజు పుట్టారని తెలిసింది. పంచాంగాలు అన్ని చూసి జనవరి 15 అమ్మ పుట్టినరోజు అని తెలిసింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఏ రోజు కూడా మా అమ్మగారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోకుండా నేను లేను. ఈ కథ చెప్పినప్పుడు నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ అది. తల్లిదండ్రులు లేనిది మనం లేము. మనం జీవితాంతం వారికి రుణపడిపోయి ఉండాలి. అది మన బాధ్యతగా తీసుకోవాలి. ఇంత గొప్ప క్యారెక్టర్ ప్లే  చేయడానికి కరెక్ట్ మనిషి విజయశాంతి గారు. ఆ దేవుడే ఈ కథ ద్వారా అమ్మని ఒప్పించాడు. అమ్మకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మాట్లాడడానికి కారణం ప్రేక్షకులు నందమూరి అభిమానులు మాకు ఇచ్చిన సక్సెస్. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అందరికీ థాంక్యు. జోహార్ ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ.. జైహింద్'అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు