తూర్పుగోదావరి జిల్లాలో కూడా జీబీఎస్ కలకలం- రాజమండ్రిలో రెండు కేసులు (video)

సెల్వి

మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (12:39 IST)
గుంటూరులో ఇటీవలే మరో మూడు గులియన్‌ బారీ సిండ్రోమ్‌(జీబీఎస్‌) కేసులు వెలుగు చూశాయి.  బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రి న్యూరాలజీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గడిచిన మూడు రోజుల్లో కొత్తగా ఈ మూడు కేసులు నమోదైనట్లు ఆసుపత్రి అధికార వర్గాలు తెలిపాయి. జీబీఎస్‌ బాధితుల్లో గర్భిణి కూడా ఉన్నట్టు పేర్కొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా జీబీఎస్ కలకలం రేపింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండు కేసులు నమోదైనాయి. ఈ వైరస్ సోకిన వారిని వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. 
 
రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను సూచిస్తున్నారు.

కొన్ని రోజుల తర్వాత అయినా నువ్వు చికెన్ తినవచ్చు కానీ ఈ సమయంలో చికెన్ తింటే మళ్లీ తినడానికి నువ్వు ఉండవు.
కొన్ని రోజులు ఎదురు చూడండి.

???????????? pic.twitter.com/9NIQLxLv2V

— Bhaskar Reddy (@chicagobachi) February 24, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు