రూ.32 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టామని, ఇందుకోసం 100 కిలోల బంగారం, 4300 కిలోల రాగి వినియోగిస్తున్నామని వివరించారు. ఈ పనులు పూర్తయ్యే వరకు భక్తులకు మూలమూర్తి దర్శనం యధావిధిగా ఉంటుందని, కైంకర్యాలన్నీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో నిర్వహిస్తారని తెలియజేశారు.
అంతకుముందు ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, దివ్యప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. అనంతరం బాలాలయ సంప్రోక్షణం చేపట్టారు. మధ్యాహ్నం నిత్యకట్ల కైంకర్యం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.