పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటిన ఆరో తరగతి విద్యార్థిని

సోమవారం, 8 మే 2023 (11:21 IST)
ఏపీలో గత శనివారం పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయాయి. ఈ పరీక్షాల్లో ఆరో తరగతి అమ్మాయి సత్తా చాటింది. ఆరో తరగతి బాలిక పదో తరగతి పరీక్షల్లో ఏకంగా 566 మార్కులు సాధించి, శభాష్ అనిపించుకుంది. ఆ బాలిక బేరు చిర్రా అనఘాలక్ష్మి. గుంటూరు పట్ణం. స్థానికంగా ఉండే బ్రాడీపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. బాలిక తండ్రి విష్ణువర్థన్ రెడ్డి. మంగళగిరి భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగి కాగా, తల్లి సత్యదేవి ఎమ్మెస్సీ బీఈడీ పూర్తిచేశారు. 
 
తల్లి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే అబాకస్, వేదిక్ మ్యాథ్స్‌లలో ప్రతిభ కనబరుస్తూ వచ్చిన అనఘా లక్ష్మి... గణిత అవధానాల్లో శతావధాన స్థాయికి చేరుకున్నారు. చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో బాలిక ప్రతిభకు ముగ్ధుడైన మంత్రి ఆదిమూలపు సురేష్.. ఆ బాలికతో పదో తరగతి పరీక్షలు రాయించాలని సూచించారు. 
 
ఆ తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో ఇటీవల ఇతర విద్యార్థులతో కలిసి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైంది. శనివారం విడుదలైన ఈ ఫలితాల్లో ఆ బాలిక 600కు గాను 566 మార్కులు సాధించి తన సత్తా చాటింది. అలాగే కాకినాడకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని ముప్పల హేమశ్రీ కూడా పదో తరగతి పరీక్షలు రాసి 488 మార్కులు సాధించి అందరితో శభాష్ అనిపించుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు