ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

దేవీ

మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (15:11 IST)
Ashok Vardhan Muppa, Sunil Balusu
సినిమా రంగాన్ని ఓటీటీ శాశిస్తుందనేది  బహిరంగ రహస్యమే. పెద్ద సినిమాలు విడుదల చేయాలంటే ఓటీటీ సంస్థలే డేట్ ఫిక్స్ చేస్తాయి. అసలు సినిమా కథ కూడా ముందుగా వారికి చెప్పాక ఓకే అంటేనే సెట్ పైకి వెళుతుంది. ఇదంతా పెద్ద స్టోరీ. అసలు విషయం ఏమంటే. ఒకప్పుడు శాటిలైట్ ను నమ్ముని సినిమాలు తీసేవారు. ఇప్పుడు ఓటీటీ దాన్ని కబ్జా చేసింది. ఇది పాండమిక్ తర్వాత జరిగిన పరిణామం. 
 
కాగా, నందమూరి కళ్యాణ్ రామ్ తో అర్జున్ S/O వైజయంతి చిత్రాన్ని నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. వీరిద్దరు క్లాస్ మేట్స్. అందుకే బాగా సింక్ అయి బడ్జెట్ కు వెనుకాడకుండా తీశారు. సినిమా తీశాక అర్తమయిందేమంటే.వారు ముందుగా ఏప్రిల్ 18న సినిమా విడుదలచేస్తామని ప్రకటించారు. కానీ అందుకు ఓటీటీ కి చెందిన సంస్థ బ్రేక్ చేసింది.  రెండు నెలల తర్వాత విడుదల చేయండి అని మీటింగ్ పెట్టి మరీ చెప్పింది. అలా అయితేనే ఓటీటీకి తీసుకుంటామని తెగేసి చెప్పింది.
 
దీనిపై నిర్మాతలు వివరిస్తూ, ఓటీటీ సంస్థలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. కోట్లు పెట్టి మేం సినిమాలు తీస్తే, దాన్ని ఓటీటీలోకి ఇవ్వాలంటే ఏవోవో కారణాలు చెబూతూ, నిర్మాతల మాట కూడా వినకుండా చులనకగా చూస్తున్నారు. మాకే ఇలా వుంటే, చిన్న నిర్మాతలు పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. మాకు తెలిసి ఏప్రిల్ లో విడుదలకావాల్సి దాదాపు 16 సినిమాలు ఓటీటీ ప్రాపకం కోసం ఎదురుచూస్తూ వాయిదా వేసుకున్నాయి. ఇంతకంటే దౌర్భాగ్యం తెలుగు సినిమాకు లేదు.
 
కనుక మేమే స్వంతంగా రిలీజ్ చేసుకుంటున్నాం. ఓటీటీపై నిర్మాతలు కలిసి రావడంలేదు. ఇక్కడా సమన్వయం లేదు. ఓ నలుగురు పెద్దల చేతుల్లో ఓటీటీ వుంది. కనుక ముందుముందు మరింతగా కొత్త నిర్మాతలు రాావాలంటే భయపడుతున్నారు. ఇప్పటికైనా నిర్మాత అనేవారు బాగా ఆలోచించి సినిమాలు తీయండి. ఏదో కొంత వుంది సినిమా తీసేద్దామని వస్తే, ఓటీటీ మీకు విలన్ గా నిలుస్తుందని అంటూ వ్యాఖ్యానించారు. ముందుముందు ఓటీటీని కంట్రోల్ చేసే కొత్తదేమైనా వస్తుందోమో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు