ఏపీ పౌల్ట్రీ వ్యాపారులకు షాక్.. ఒడిస్సాలో ఆగిపోయిన 200 లారీలు

బుధవారం, 27 ఏప్రియల్ 2022 (19:55 IST)
ఏపీ పౌల్ట్రీ వ్యాపారులకు ఒడిశా సరిహద్దు వద్ద షాక్ తగిలింది. ఆంధ్రా- ఒడిశా బోర్డర్ వద్ద ఏపీకి చెందిన వందలాది కోడిగుడ్ల లారీలు నిలిపివేశారు. ఏపీకి చెందిన 200కు పైగా కోడి గుడ్ల లారీలను ఒడిశా అధికారులు నిలిపివేశారు. 
 
ఒడిశాలో కోడి గుడ్ల ధరలు భారీగా పడిపోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.  దీంతో ఆంధ్రా- ఒడిశా బోర్డర్ వద్ద జాతీయ రహదారిపై 2 కిలో మీటర్ల మేర లారీలు నిలిచిపోయాయి. 
 
ఆంధ్రా నుంచి భారీగా జరుగుతున్న ఎగుమతుల వల్ల తమ రాష్ట్రంలో కోడిగుడ్లకు గిరాకీ లేకుండా పోతోందని ఒడిశా వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఇటీవల కాలంలో కోడి గుడ్డు ధర రూ. 4.25 నుంచి 3.25 పైసలకు పడిపోయిందని ఒడిశా వ్యాపారులు వాపోతున్నారు. అందుకే ఆంధ్రా గుడ్లను ఒడిశాలోకి అనుమతిచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
 
దీంతో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం ఉయదం 10:30 గంటల వరకు దాదాపు 200 లారీలు ఒడిశా బోర్డర్ వద్ద నిలిచిపోయాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు