వైసీపీ రెండేళ్ల పాలనలో నష్టం తప్ప ప్రజలకు జరిగిన లాభం లేదనీ, కొత్త పరిశ్రమ ఒక్కటి రాకపోగా ఉన్నవి వెనక్కిపోతున్నాయన్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించే పైపుల ఫ్యాక్టరీని స్థానిక ఎమ్మెల్యే బలవంతంగా మూసివేయిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు?
గిరిజనులు, దళితులు, నిరుపేదలను పథకాలు రద్దు చేస్తామని బెదిరించి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకోం... అందరం అక్కడకు చేరుకుని తాడోపేడో తేల్చుకుంటాం.
ఇవి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఎన్నికలు కాదు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఎన్నికలు. ప్రతి ఓటరూ తమ ఓటును స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.