Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

దేవీ

మంగళవారం, 26 ఆగస్టు 2025 (18:38 IST)
Bunny Raju, Kanika Wadhwa
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వినూత్నమైన కథలలో రాబోతున్న సినిమాలలో బ్రహ్మాండ సినిమా ఒకటి. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమాలో నటి ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
 
నటి ఆమని మాట్లాడుతూ, బ్రహ్మాండ మూవీ తెలుగు ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతి అనుభూతిని ఇస్తుంది అని తెలిపారు. అలానే ఈ సినిమా గురించి మరిన్ని విషయాలను చెప్పారు నటి ఆమని. ఇంత మంచి సినిమా సినిమా డైరెక్ట్ చేసిన రాంబాబు గారు మన మధ్య లేకపోవడం బాధకారం.
 
హీరో బన్నీ రాజు మాట్లాడుతూ, ఈ సినిమాలో నాది అద్భుతమైన పాత్ర. సినిమా నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. ఈ సినిమాను శుక్రవారం రిలీజ్ చేయబోతున్నాం. అందరూ చూసి ఆదరించండి. ముఖ్యంగా క్లైమాక్స్ ని మిస్ చేయకండి. అద్భుతమైన అనుభూతిని పొందుతారు.  
 
నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ, స్క్రిప్ట్ దశలో  మేము అనుకున్నది అనుకున్నట్టుగా .. అంతకుమించి చిత్రీకరించా చిత్రీకరించాం. మా డైరెక్టర్ ఇప్పుడు మా మధ్య లేకపోవడం బాధకరం.  ముఖ్యంగా ఆమని గారు బలగం జయరాం గారు కొమురక్క గార్ల సహకారం మేము మరవలేము అని చెప్పారు . 
 
నటీనటులు :  ఆమని బలగం జయరాం కొమరక్క బన్నీ రాజు, కనీకావాధ్వ చత్రపతి శేఖర్ అమిత్, దిల్ రమేష్ ప్రసన్నకుమార్ దేవిశ్రీ కర్తానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు