13 వేల మంది గ్రామీణ పేద విద్యార్థులకు అంతర్జాతీయ సాంకేతిక విద్య అందించడం, అత్యున్నత స్థాయి వసతులు, ఇంటర్నేషనల్ లెవల్ ప్రయోగశాలలు నెలకొల్పడం, వర్సిటీలో 68 శాతం విద్యార్థినులకు సాంకేతిక విద్య అందించడం తదితరార అంశాలను అవార్డు కేటాయింపులో పరిగణలోకి తీసుకున్నారని వివరించారు. ఈ అవార్డును ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.