పవన్ మాట సీఎం చంద్రబాబు పట్టించుకుంటారా...?

మంగళవారం, 2 మే 2017 (20:25 IST)
గుంటూరులో మిర్చి రైతులకు గిట్టుబాటు ధరల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీక్ష ముగిశాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం చంద్రబాబు నాయుడు తన రికార్డులను తనే బద్ధలు కొట్టుకుంటుంటారనీ, అది రైతులకు అన్యాయం చేయడంలో అంటూ మండిపడ్డారు. ఇదిలావుంటే జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఓ లేఖ రాశారు. 
 
మిర్చి రైతుకు క్వింటాలుకు రూ.11 వేలు గిట్టుబాటు ధరను ప్రభుత్వం చెల్లించాలనీ, మార్కెట్లో రైతుల వద్ద ఎంతకు తీసుకుంటున్నారో... ఆ ధరకు ఈ ధరకు మధ్య వున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ప్రభుత్వమేనంటూ పేర్కొన్నారు. కాగా మిర్చి గిట్టుబాటు ధర సమస్య అటు తెలంగాణలో ఇటు ఆంధ్రలోనూ వుంది. ఈ నేపధ్యంలో పవన్ ఏ ప్రభుత్వానికి సూచన చేశారన్నది క్వచ్చన్ మార్కుగా వుంది. ఐతే సహజంగా ఆయన ఏపీని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సర్కారుకే అని అనుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి