గంజాయి బ్యాచ్ బీభత్సం.. ఏకంగా పోలీసులపైకే కారు ఎక్కించిన వైనం...(Video)

ఠాగూర్

గురువారం, 2 జనవరి 2025 (09:55 IST)
వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల పైనుంచి దూసుకెళ్లిందో కారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. కొత్త సంవత్సరం వేళ కాకినాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆసమయంలో వచ్చిన కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే, ఆ కారులో గంజాయిని తరలిస్తుండటంతో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వీలుగా వారిపైనే పోనిచ్చారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. 
 
ఈ క్రమంలో అర్థరాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారును ఆపారు. రోడ్డు పక్కన ఆపుతున్నట్టు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగం పెంచి ముందుకు పోనిచ్చాడు. దీంతో వాహనం ముందు నిల్చున్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాజ లోవరాజుతోపాటు మరో కానిస్టేబుల్‌పై నుంచి కారు దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు.
 
మరోవైపు, కానిస్టేబుళ్లను ఢీకొట్టి వెళ్లిన కారు డ్రైవర్ రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వాహనాన్ని వదిలి పరారయ్యాడు. డ్రైవర్‌తోపాటు ఇతర నిందితులు పశ్చిమ గోదావరిలో పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. కాగా, నిందితులు వదిలి వెళ్లిన కారు ఉత్తరప్రదేశ్‌లో రిజిస్టర్ అయింది. అందులో గంజాయి రవాణా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

గంజాయి బ్యాచ్ బీభత్సం.. ఏకంగా పోలీసులపైకే కారు ఎక్కించిన వైనం

కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

అదే సమయంలో కారులో గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు

కారు ఆపేందుకు ప్రయత్నించగా.. కానిస్టేబుళ్లపైకి ఎక్కించిన గంజాయి బ్యాచ్

ఈ ఘటనలో గాయపడ్డ… pic.twitter.com/Or3jq3CpGP

— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు