వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి 18 నెలల పాటు అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడిపారు. అలాంటి వ్యక్తి జగన్‌తో తన వదిన (భారతి) ఎలా కాపురం చేస్తుందో జగన్ సోదరి షర్మిల తెలుసుకోవాలని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. వైకాపా ప్లీనరీలో జగన్ సోదరి షర్మిల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
తాజాగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్య నిషేధం విధిస్తానని చెప్పిన జగన్, మొట్టమొదట తన పక్కన ఉన్న వాళ్లతో మద్యం మాన్పించాలని, తమ పార్టీ నేతలతో మద్యం వ్యాపారం కూడా మాన్పించాలని ఆయన సూచించారు. జగన్‌కు రాజకీయం చేతగాకనే ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకున్నారని విమర్శించారు.