బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

సెల్వి

సోమవారం, 7 జులై 2025 (18:11 IST)
చాలా మంది అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి సగ్గుబియ్యం ఓ వరం వంటివి. సగ్గుబియ్యంతో చేసిన వంటలు ఇష్టపడని వారు ఉండకపోవచ్చు. జ్వరం, విరోచనాలు వంటి సమస్యలు పీడిస్తున్నప్పుడు సగ్గుబియ్యం జావ, పాయసం నీరసం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాంటి సగ్గుబియ్యం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 
ఆ వివరాలివీ.. బరువు తగ్గాలనుకునేవారికి సగ్గుబియ్యం ఓ వరంలాంటిది. ఇందులోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది. అలాగే ఇందులో క్యాలరీలు కూడా తక్కువ కావడంతో బరువు తగ్గేందుకు బాగా సహాయపడుతుంది.
 
సగ్గుబియ్యంలో ఉండే క్యాల్షియం ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తుంది. సగ్గుబియ్యం జావ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. శరీరంలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేయడంలో సగ్గుబియ్యం సహాయపడతాయి. సగ్గుబియ్యంలోని పొటాషియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు