కర్నూలు జిల్లాలో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న ఎస్ఐ

బుధవారం, 8 డిశెంబరు 2021 (13:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడుని కర్నూలు పట్టణ పరిధిలోని వెంకటరమణ కాలనీకి చెందిన రాఘవరెడ్డిగా గుర్తించారు. ఈయన తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా పదోన్నతి రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. 
 
కాగా, మృతుడు కర్నూలు జిల్లాలోలని ఈ-కాప్ విభాగంలో విధులు నిర్వహించే రాఘవరెడ్డిగా గుర్తించారు. ఈయన వెంకటరమణ కాలనీలోని అక్షయ కాలనీలో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన తన ఇంట్లో పురుగుల మందు తాగి బయటకు వచ్చి లిఫ్టు వద్ద పడిపోయివున్నాడు. దీన్ని గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, ఆయన్ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు వెల్లడించారు. 
 
ఈయన అనంతపురం జిల్లా నల్లమాడ మండలం నల్ల సింగాయగారి పల్లెకు చెందిన రాఘవరెడ్డి 1991 బ్యాచ్‌కు చెందిన ఎస్.ఐ. వివిధ కారణాల రీత్యా ఆయన పదోన్నతులు పొందలేకపోయారు. ప్రస్తుతం ఈ-కాప్ విభాగంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు