యునెస్కో తాత్కాలిక జాబితాలో 'లేపాక్షి' ఆలయానికి చోటు

మంగళవారం, 29 మార్చి 2022 (09:04 IST)
లేపాక్షి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు దక్కేందుకు మరో అడుగు దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి ఆలయానికి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటుదక్కింది. అయితే, అరుదైన గుర్తింపు దక్కేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది. 
 
అయితే, యునెస్కో వారసత్ కట్టడాల జాబితాలో చోటు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అదే జరిగితే ఏపీ నుంచి యునెస్కోలో స్థానం సంపాదించుకున్న తొలి ఆలయంలో చరిత్రకెక్కుతుంది. 
 
తాజాగా మన దేశం నుంచి మొత్తం మూడు ప్రాంతాలకు యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. వాటిలో ఒకటి లేపాక్షి ఆలయం ఉండటం గమనార్హం. 
 
ఈ తాత్కాలిక జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారి స్థానం వరించింది. మరో ఆరు నెలల్లో యునెస్కో తుది జాబితాను వెల్లడించనుంది. అందులే కనుక లేపాక్షి ఆలయానికి చోటు దక్కిందే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు