చిత్తూరు, నగరంలోని మహాదేవనాయుడు ఇటుకల ఫ్యాక్టరీ సమీపం లోని గుట్ట(చిత్తూరు ఏస్టేట్) వద్ద విద్యుత్ హై పవర్ లైన్ పైన పిడుగు పడటంతో అక్కడి కొండపై పేలుడు శబ్దం వచ్చింది. విద్యుత్ తీగ పడటంతో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ విమానం కూలిపోయిందంటూ వదంతులు చెలరేగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.