దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను కట్టడి చేసేందుకు కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయినప్పటికీ ఫలితం పెద్దగా కనిపించడం లేదు. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో రాత్రి నిర్భంధంతో పాటు కొన్నిచోట్ల లాక్డౌన్ కొనసాగుతోంది.
గ్రామాల్లో రోజుకు 4లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో 2లక్షల డోసులు అందజేయాలన్నారు. వాక్సినేషన్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు, ఆశావర్కర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కరోనా రోగులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.