విశాఖలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే కత్తులతో దుండగలు ఇద్దరిని హత్య చేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. కారులో వచ్చిన ఓ ముఠా ఈ హత్యకు పాల్పడింది. మెడపై కత్తిపోట్లు, మణికట్టు వరకు తెగిపడిన చేయి, రోడ్డుపై రక్త ప్రవాహంతో ఘటనాస్థలి అత్యంత భయానకంగా మారింది.