దళితులపై దమనకాండ చేసి, మీరా దళితుల గురించి మాట్లాడేది?.. సంబంధం లేకుండా అనవసరంగా టాపిక్స్ మాట్లాడవద్దని వైకాపా నేతలపై మండిపడ్డారు. తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీష్‌లో మాట్లాడినా తప్పంటే ఎలా అంటూ వైకాపా నేతలను ఉద్దేశించి నారా లోకేష్ సెటైర్లు విసిరారు.
రాష్ట్రం కోసమే టీడీపీ, జనసేన రెండూ కలిసి ఎన్డీయేకు మద్దతు తెలిపాయని నారా లోకేష్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ముందుగానే చెప్పామన్నారు. అధికారంలోకి రాగానే రూ.13వేల కోట్లు రాష్ట్రానికి తీసుకొచ్చామని వెల్లడించారు. అమరావతి, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామని... విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కును కాపాడుకున్నామని వివరించారు.