ఇదే అంశంపై వాచ్‌మెన్ మాట్లాడుతూ, తాను గేటు పక్కనే ఉంటానని, అలాంటిది ఏం జరిగినా తనకు తెలుస్తుందన్నారు. అంతేగాక, శంకర్ టవర్స్ వద్దకు సుబ్రహ్మణ్యం రాలేదని చెపుతున్నారు. అనంతబాబు అబద్దాలు చెబుతున్నారన్నారు. అనంతబాబును సాయంత్రం 4 గంటలకు వెళ్లారని, మంళ్లీ రాత్రి ఒంటి గంటకు తిరిగి వచ్చారని ఆ సమయంలో అనంతబాబుతో మేడమ్ కూడా ఉన్నారని తెలిపారు.
రాత్రి ఒంటి గంటకు అనంతబాబు భార్యతో కలిసి పైకి వెళ్లారని, మళ్లీ కిందకు అనంతబాబు ఒక్కరే వచ్చారని తెలిపారు. అయితే, అపార్టుమెంట్ సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు ఇప్పటికే తీసుకున్నారని తెలిపారు. అందులో ఎలాంటి గొడవ జరిగినట్టు రికార్డు కాలేదన్నారు.
ఈ వాచ్‌మెన్ మృతుడు సుబ్రహ్మణ్యం చిన్నాన్న కావడం గమనార్హం. అయితే, ఒంటిగంట సమయంలో అనంతబాబుతో ఆయన భార్య కూడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. సుబ్రహ్మణ్యం హత్య జరిగినపుడు ఆయన భార్య అక్కడు ఎందుకు ఉన్నారన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది.