ఎంతో ఆసక్తిని రేకెత్తించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంతవరకు బాగానే వుంది. కానీ, ఈ ఎన్నికల ఫలితాల తర్వాత సరికొత్త ట్విస్ట్ మొదలైంది. ఈ ఫలితాలు వెల్లడైన తర్వాత పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్, నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయడం, అనంతరం ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలను ప్రకటించడం సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా, మా అధ్యక్ష బాధ్యతలను కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు స్వీకరించకముందే ఆయన ముందు అనేక సవాళ్లు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా, మా కొత్త కమిటీకి ఎన్నికైన 11 మంది చేసిన మూకుమ్మడి రాజీనామాలను విష్ణు ఆమోదిస్తారా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా మా అసోసియేషన్‌లో ఏదైనా ఒక పదవి ఖాళీ ఏర్పడితే, దాన్ని భర్తీ చేసే అధికారి మా అధ్యక్షుడిగా ఉంటుంది. 'మా' బైలాస్ నిబంధన ప్రకారం.. మా సభ్యుడి పోస్ట్‌కు ఖాళీ ఏర్పడితే.. ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకొని దాన్ని భర్తీ చేస్తారు.