ఆకు రౌడీలకు, గాలి రౌడీలకు భయపడే వ్యక్తిని కాదు.. పవన్

శనివారం, 12 జనవరి 2019 (10:47 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై విరుచుపడ్డారు. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతోందని ప్రశ్నించారు. తాను ఆకు రౌడీలకు, గాలి రౌడీలకు భయపడే వ్యక్తిని కాదని పవన్ అన్నారు. తాను ఒక్క సైగ చేస్తే కాళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతారని పవన్ కల్యాణ్ తెలిపారు.
 
16 ఏళ్ల ప్రాయంలోనే తన్ని తరిమేశానని చెప్పారు. చింతమనేనిలాంటి వ్యక్తులను వెనకేసుకొస్తున్న టీడీపీకి తాను అండగా ఎందుకుండాలని ప్రశ్నాస్త్రాలు సంధించారు. ప్రజా సంక్షేమం కోసం ఎవరితోనే గొడవకు రెడీ అన్నారు. టీడీపీ నేతలను తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదని, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఒక పరిధిలో మాత్రమే విమర్శలు చేశానని పవన్ చెప్పారు. జగన్‌లా చంపేయండి, చింపేయండి అనలేదన్నారు.
 
2014లో జనసేనని స్థాపించిన‌ప్పుడు జ‌గ‌న్ సీఎం అవుతున్నాడు నువ్వేం చేస్తావని అన్నారని, కానీ తాను ముఖ్యమంత్రిని కావడానికి రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక్క నాయకుడు కూడా మనకి అండగా నోరు మెదపలేదని గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు