ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం అఖిల పక్షాలు, వివిధ ప్రజా సంఘాలతో మీరు సమావేశం ఏర్పాటు చేయడం హర్షణీయం. ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అయితే బుధవారం సమావేశం ఏర్పాటు చేసి, మంగళవారం సాయంత్రం ఆహ్వానం పంపడం ఆక్షేపణీయంగా వుంది. తగిన సమయం ఇవ్వకుండా,సమావేశం పూర్తి స్థాయి ఎజెండాను నిర్ణయించకుండా ఏర్పాటు చేసిన ఈ సమావేశం కేవలం మొక్కుబడిగా గోచరిస్తోంది.
రాజకీయ లబ్ది కోసమా అన్న సందేహాలను రేకెత్తిస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం సంఘటితంగా పోరాటం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడివుంది. అయితే ఆ పోరాటంలో చిత్తశుద్ధి వున్నప్పుడు మాత్రమే జనసేన చేతులు కలుపుతుంది.